నటుడు శివాజీ గురించి అందరికి తెలిసిందే. శివాజీ ఇటీవల శివాజీ సినిమాలు తగ్గించి పొలిటికల్ కామెంట్స్ తో వైరల్ అవుతున్నారు.ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ అయితే చాలా టైట్ గా ఉంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేశారు. ఓజి చిత్రం కోసం సుజీత్ లొకేషన్స్ వేటలో ఉన్నారు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలయింది.
చిత్ర యూనిట్ ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారుపవన్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన సహ నటుల నుంచే విమర్శలు ఎదురవుతుంటాయి. నటుడు శివాజీ గురించి అందరికి తెలిసిందే. శివాజీ ఇటీవల శివాజీ సినిమాలు తగ్గించి పొలిటికల్ కామెంట్స్ తో వైరల్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ విధేయుడిగా శివాజీ ముద్ర వేయించుకున్న సంగతి తెలిసిందే. శివాజీ, పవన్ కళ్యాణ్ కలసి ఖుషి చిత్రంలో నటించారు.గతంలో శివాజీ చేసిన పొలిటికల్ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఇటీవల శివాజీ కాస్త సైలెంట్ మైంటైన్ చేశారు. తిరిగి మళ్ళీ తనదైన శైలిలో విమర్శలు ప్రశంసలు మొదలు పెట్టారు. కాకపోతే ఈసారి కాస్త భిన్నంగా. తాజాగా ఇంటర్వ్యూలో శివాజీ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.నాకు ఎవరినో తిట్టాలని కానీ, పొగడాలని కానీ లేదు. ఎవరితోనూ నాకు ఫ్యాక్షన్ గొడవలు లేవు. కాకపోతే సమాజం బాగుండాలని కోరుకుంటా. జగన్ మోహన్ రెడ్డి గారిని కానీ, మోడీ గారిని కానీ, పవన్ గారిని కానీ విమర్శించాలని నాకు లేదు. జనసేన పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. వాళ్ళకి ఉండే ఓటు బ్యాంక్ వాళ్ళకి ఉంది. గోదావరి జిల్లాలో వాళ్ళు అద్భుతాలు చేయవచ్చు.పవన్ కళ్యాణ్ ఒక శక్తి అనేది స్పష్టం.
ఆయన అనుకుంటే ఏ పని అయినా అవుతుంది. కానీ ఆయన ఏమీ అనుకోడు. ఎందుకు అనుకోడో నాకు అర్థం కావడం లేదు. ఆయన రోడ్డు మీదికి వచ్చి పోరాటం చేస్తే మద్దతు ఇచ్చే ప్రజలు చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గర అస్త్రాలు ఉన్నాయి. వాటిని కరెక్ట్ టైం లో సంధించడం లేదు అనేదే నా భాద.జగన్ మోహన్ రెడ్డి గారిని చూడండి.. ఆయన చాలా ఫోకస్డ్ పొలిటీషియన్. ఆయన ఫోకస్ పెట్టారంటే అది సాధిస్తారు. అలాగే వైసిపిని పవర్ లోకి తెచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. జగన్, పవన్ మధ్య ఉండే తేడా అదే. మనం ఇప్పుడు చూస్తున్నది అసలైన పవన్ కళ్యాణ్ కాదు. ఆయనలో ఇంకా ఏదో ఉంది. అది తెలుసుకున్న రోజున పవన్ తప్పకుండా సీఎం అవుతారు. అది ఆయనకే తెలియడం లేదు. నువ్వు అనుకుంటే అయిపోద్ది సామీ అంటూ మహేష్ బాబు ఖలేజా డైలాగ్ గుర్తుకు వచ్చేలా శివాజీ పవన్ పై విమర్శలు సంధించారు.