రేణును రెచ్చగొడుతున్న ఫ్యాన్స్. ఎలక్షన్ వేళ పవన్‌కు కొత్త తలనొప్పి.

Categories:

ఎన్నికల సమయంలో కొత్త రచ్చకు దారి తీస్తున్నారు పవన్ అభిమానులు. విషయం ఏంటంటే.
పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ.ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా. పవన్, రేణు తనయుడు అకీరా నందన్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషేస్ తెలియజేశారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మా అన్న కొడుకు అకీరాను చూడాలని ఉంది. మీరు దాచిపెట్టకండి’ అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌పై స్పందించిన రేణు ‘మీ అన్న కొడుకా? అకీరా నా అబ్బాయి, మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు హర్డ్‌కోర్ ఫ్యాన్ అని అర్ధం చేసుకోగలను. కానీ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి” అంటూ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా. రీసెంట్‌గా ఓ మహిళ రేణుకు సపోర్ట్‌గా పవన్ మీద దారుణ ఆరోపణలు చేసింది. ఆ వీడియో కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. రేణు దేశాయ్‌కు పవన్ అన్యాయం చేశాడని ప్రచారాలు చేస్తున్నారు. కాగా. సద్దుమణిగిన మేటర్ పవన్ కళ్యాణ్ అభిమానుల కారణంగా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇలాంటి వాదనలు పవన్ కళ్యాణ్‌కు కొత్త తలనొప్పి తెచ్చుపెడుతున్నాయని. వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులను కానీ రేణును గానీ సైలెంట్ చేసి ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. కోట్లలో ఉన్న అభిమానులను సైలెంట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి. రేణుతో పవన్ మాట్లాడి ఈ వివాదానికి తెరదించడం బెటర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *