మంత్రి రోజాకి “బ్రహ్మాజీ” కౌంటర్

Categories:

కొద్ది రోజుల క్రితం ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.రోజాని డైమండ్ రాణి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంతో ఈ అంశం మీద వైసిపి నుంచి పెద్ద ఎత్తున కౌంటర్ అటాక్స్ వచ్చాయి.

రోజాని డైమండ్ రాణి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంతో ఈ అంశం మీద వైసిపి నుంచి పెద్ద ఎత్తున కౌంటర్ అటాక్స్ వచ్చాయి.

ఆ తరువాత జనసేన నిర్వహించిన ఓ సభలో హైపర్ ఆది పాల్గొని ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

ఇక అప్పటివరకు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన మంత్రి రోజా ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, నాగబాబును కూడా కలుపుకొని విమర్శలు చేస్తున్నారు.
జనసేన పార్టీలో నాగబాబు కూడా యాక్టివ్ గా ఉండడంతో వీరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ లో ఆరేడు మంది హీరోలు ఉన్నారని, వాళ్లకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రావని.

ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమోనన్న భయంతో చిన్న ఆర్టిస్టులు కూడా వాళ్లకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు.

అంతే తప్ప వాళ్లపై ప్రేమతో మాట్లాడడం లేదన్నారు రోజా.

మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసినప్పుడు ఆయన ప్రెసిడెంట్ గా ఎందుకు గెలవలేదో ఆలోచించాలన్నారు.
అలాంటి వారి కోసం చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు రోజా.

అయితే రోజా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. ” నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా.

అంతా భయపడతారు ఎందుకు” అని ట్విట్టర్ లో మంత్రి రోజాను ప్రశ్నించారు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమా ఇండస్ట్రీ నుంచి మొదటిసారి రియాక్ట్ అయిన పర్సన్ నువ్వే అన్న.. థాంక్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు.

మరి బ్రహ్మాజీ ట్వీట్ కి రోజా ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *