ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక మాములు నటుడు అని ఉన్న తన పేరుకి మెగాస్టార్ అని ఒక అతిపెద్ద బిరుదును తన సినిమాలతో తెచ్చి పెట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
ఈయన ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి ఆదర్శం. ఎందుకంటే ఈయనకు కొంచెం కూడా సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చారు.
అలా వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినప్పటికీ తన ఆశయం మాత్రం వదులుకోకుండా తనకి సినిమా మీద ఉన్న ఇష్టంతో స్టార్ హీరోగా మారారు.
ఇక అలాంటి చిరంజీవి ఇప్పటికే 150 కి పైగా సినిమాల్లో నటించి ఇప్పటికి కూడా నటిస్తూనే ఉన్నారు.
ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి.
ఇక సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది చిత్ర యూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి తన గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టారు. అంతేకాదు చిరంజీవిపై విష ప్రయోగం
చేసిన వారిపై కూడా క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ.. ఒక అభిమాని నాపై ఉన్న పిచ్చి అభిమానంతో ఇలా నాపై విష ప్రయోగం చేశారు.
అయితే అప్పట్లో అభిమానులు హీరోలను డైరెక్ట్ గానే కలిసేవారు.ఇక ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఓ అభిమాని వచ్చి నా బర్త్ డే అని చెప్పి నాతో కేక్ కట్ చేయించాడు.
కానీ నేను ఎప్పుడైనా స్పూన్ తోనే కేక్ తింటాను. అయితే అభిమాని మాత్రం ఆ రోజు బలవంతంగా నా నోట్లో కేక్ పెట్టారు.కానీ ఆ కేక్ చేదుగా ఉందని బయటికి ఉమ్మేసాను
.ఆ తర్వాత ఆ కేక్ లో ఏదో పౌడర్ కలిపారని క్లారిటీ వచ్చింది. వెంటనే పౌడర్ కలిపిన వ్యక్తిని పట్టుకొని కొట్టడంతో అసలు విషయం బయట పెట్టాడు.
అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు నా వీరాభిమానట.అంతేకాదు అభిమాన సంఘానికి అధ్యక్షుడట. అయితే చాలా రోజుల నుండి నేను ఆ వ్యక్తిని పట్టించుకోవడంలేదని కేరళ వెళ్లి ఏదో పౌడర్ తీసుకువచ్చి నాపై వశీకరణ చేయాలని చూసి నేను తినే కేక్ లో ఆ పౌడర్ కలిపారట.
కానీ తన మూర్ఖత్వంతో ఇలాంటి పని చేశాడని తెలిసి నేను కూడా అతన్ని క్షమించి వదిలేసాను.. అంటూ చిరంజీవి తనపై విషప్రయోగం జరిగిన సంఘటనపై క్లారిటీ ఇచ్చారు.