జగన్‌తో లావాదేవీలు
అయితే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం వెంటనే తమ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీతో ఈ ఇద్దరు హీరోలు రాసుకొని పూసుకొని తిరిగారు. వ్యాపారాల పరంగా లావాదేవీలు నిర్వహించి భారీ లాభాలను మూటకట్టుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు జగన్‌కు ఒకరు రైట్ హ్యాండ్, మరొకరు లెఫ్ట్ హ్యాండ్ అన్నట్లుగా ఉండేవారని సమాచారం. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేస్తున్నారనే సమాచారం బయటకు రాగానే వైసీపీ నాయకులు దూషణ పర్వం కొనసాగించారు.జనసేన అధినేత కొణిదెల పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి 74వేల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయాన్ని సాధించారు. అంతేకాదు తనతోపాటు పోటీచేసిన మరో 20 మందిని వారివారి నియోజకవర్గాల నుంచి అద్భుతమైన మెజారిటీతో గెలిపించగలిగారు. ఎన్నికల చరిత్రలో వందకు వంద శాతం స్ట్రైక్ రేటు నమోదు చేసిన జనసేన సంచలన రికార్డును నమోదు చేసింది. పవన్ విజయం సాధించగానే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, అన్ని విభాగాలకు చెందిన ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్‌కల్యాణ్ గెలవగానే ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు
Categories: