జనసేనాని పవన్ కళ్యాణ్ విజయంతో అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏపీ సురక్షిత చేతుల్లో ఉందని మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశాడు.
సినీ పరిశ్రమలో పవన్ వీరాభిమానిగా ముద్ర పడిన హీరో నితిన్ సైతం ట్వీట్ చేశారు. ఇక పవన్ వీరభక్తుడు హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ సెట్స్‌లో టపాసులు కాల్చారు. టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ పవన్ (Pawan Kalyan)కు అభినందనలు తెలియజేస్తుంటే.మెగా అభిమానులు, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మాత్రం ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
జనసేనానికి బన్నీ శుభాభినందనలు…
”అద్భుతమైన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా శుభాభినందనలు. ప్రజలకు సేవ చేయాలని కొన్నేళ్లుగా మీరు చేస్తున్న కృషి, మీ పట్టుదల, హృదయానికి హత్తుకునేవి. మీ కొత్త ప్రయాణానికి బెస్ట్ విషెష్” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ విజయంతో పాటు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల విజయం పట్ల ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారని అనుకోవాలి