మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అలాగే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ బిజీ గా వున్నారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
2003 లో గీత లక్ష్మి అనే వ్యక్తి నుండి ఎన్టీఆర్ ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు.అయితే గీత లక్ష్మి 1996 నుండి ఇదే ప్రాపర్టీ మార్ట్ గెజ్ ద్వారా లోన్స్ పొందింది.ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి గీత లక్ష్మి మూడు,నాలుగు బ్యాంకుల నుండి గీత లక్ష్మి లోన్స్ పొందింది.అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ఫ్లాట్ అమ్మే సమయంలో ఆ విషయాన్నీ దాచి పెట్టింది.కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గెజ్ ద్వారా లోన్ తీసుకున్నట్లు ఆమె ఎన్టీఆర్ కు తెలిపింది.దీనితో ఫ్లాట్ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి.ఈ నేపథ్యంలో 2019 లోనే బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.తాజాగా ఆయనకు వ్యతిరేకంగా DRT రావడంతో ఎన్టీఆర్ కోర్ట్ మెట్లెక్కారు.జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది.జూన్ 6 న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది .