నువ్వా మాకు నీతులు చెప్పేది. శ్యామలపై పవన్ ఫ్యాన్స్ దారుణమైన ట్రోల్స్ వైరల్.

| | 0 Comments| 5:25 pm
Categories:

లీవుడ్ యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.వైసీపీకి అనుకూలంగా శ్యామల ప్రచారం చేయాలని అనుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని పవన్, చంద్రబాబులపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే శ్యామల పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. నువ్వా మాకు నీతులు చెప్పేది అంటూ పవన్ ఫ్యాన్స్ శ్యామలను దారుణంగా ట్రోల్ చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. శ్యామల వ్యక్తిగత జీవితంలోని వివాదాలను వెలుగులోకి తెచ్చి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

శ్యామల పలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేస్తున్నారు.శ్యామల నివశించేది హైదరాబాద్ లో అని ఆమెకు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని కామెంట్లు చేస్తున్నారు. శ్యామల భర్తపై గతంలో నమోదైన కేసులను సైతం ఈ సందర్భంగా నెటిజన్లు వెలుగులోకి తెస్తున్నారు. శ్యామల జనసేన, టీడీపీ లపై హద్దులు దాటి విమర్శలు చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నువ్వా మాకు నీతులు చెప్పేది అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. శ్యామల ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. శ్యామల అనవసరంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ స్థాయిని తగ్గించేలా కామెంట్స్ చేస్తే ఊరుకోమని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *