టాలీవుడ్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ.. ఏం మాట్లాడిన, ఏం చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. ఈక్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయ పార్టీలు గురించి మాట్లాడారు.
అవి కాస్త నెట్టింట వైరల్ అవ్వడం, ట్రోల్స్ కి గురవ్వడం జరిగాయి. దీంతో ఆ కామెంట్స్ కి అనసూయ వివరణ ఇచ్చారు.
అసలు ఏం జరిగిందంటే, ఓ ఇంటర్వ్యూలో అనసూయని.. ‘నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి పిలిస్తే వెళ్తారా..?’ అని ప్రశ్నించారు. దానికి అనసూయ బదులిస్తూ.. “నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు రోజా గారు పిలిచినా వెళ్తాను. నేను పార్టీలను చూడను, వ్యక్తులను మాత్రమే చూస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ కామెంట్స్ కాస్త నెట్టింట ఎలా వైరల్ అయ్యాయంటే.. ‘అనసూయ జనసేన తరుపున ప్రచారం చేస్తారంట’ అంటూ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్న అనసూయని ఈ విషయం గురించి ప్రశ్నించారు. ‘మీరు జనసేన తరుపున ప్రచారం చేస్తున్నారంట నిజమేనా..?’ అంటూ ప్రశ్నించారు.
దీనికి అనసూయ బదులిస్తూ.. “నేను ఏం చేసిన అది వివాదం అయ్యిపోతుంది. ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు, దానికి తగ్గట్లు బదులిచ్చాను. అంతేగాని, జనసేనకు ప్రచారం చేస్తానని నాకు నేనుగా చెప్పలేదు. ప్రతి పార్టీకి కొన్ని మంచి అజెండాలు ఉంటాయి. అలాంటి అజెండాలతో ముందుకు వెళ్లే మంచి లీడర్ నన్ను ప్రచారానికి రమ్మని అడిగితే, అతను ఏ పార్టీ లీడర్ అయినా వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు మంచి లీడర్” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
నేను జనసేనకు ప్రచారం చేస్తా అనలేదు.
Categories: