వారికి మాత్రమే రూ.500 గ్యాస్ సిలిండర్‌.మహాలక్ష్మి పథకం.

Categories:

మహిలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింస్తుందని వెల్లడించింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారు పథకానికి అర్హులుగా నిర్ణయించింది. మహిళా పేరుపై గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపింది. గత మూడేళ్ల సిలిండర్ల వినియోగాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీంకి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారుల గుర్తింపు లభించనుంది.తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా పెట్టింది. మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్ల కేటాయించారు. మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయనున్నారు. నెల నెల సబ్సిడీ అమౌంట్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లకు ప్రభుత్వం నేరుగా ట్రాన్స్ఫర్ చేయనుంది. భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం 500 రూపాయలు చెల్లించేలా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్ లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ కానుంది.అయితే ఇన్ని రోజులుగా రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వస్తుందని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి మహిళల పేరు మీద కాకుండా భర్త, అత్త, మామల గ్యాస్‌ కనెక్షన్‌ వున్నాయి. దీంతో గ్యాస్‌ కనెక్షన్‌ మహిళ పేరుమీదే ఉండాలన్న నిబంధనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక వేళ మహిళపై కాకుండా కుటుంబ సభ్యులపై గ్యాస్‌ కనెక్షన్‌ లు ఉంటే మార్చుకునే వీలుంటే వీరికి కూడా అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా.. డిసెంబర్ 2023లో గ్యాస్‌ కనెక్షన్‌ మహిళ పేరు మీద ఉంటేనే వర్తిస్తుందని వార్తలు రావడంతో. గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు ప్రజలు బారులు తీసిన విషయం తెలిసిందే.. అయితే ఇది ఫేక్ వార్త అని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ సర్కార్ మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ విడుదల చేయడంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఒక వేళ గ్యాస్ కనెక్షన్‌ మహిళ పేరును మార్చుకునే ఛాన్స్ ఉంటే. మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా? లేదా? అనే డైలమాలో ప్రజలు ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా? ఎలా స్పందించనుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *