వరంగల్ కు చెందిన ఏఆర్ ఎస్సై రవికుమార్ మేడారంలో జాతరలో విధులకు హజరయ్యారు. ఆయన రోప్ పార్టీ ఇన్ చార్జీగా డ్యూటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం.. తన కుటుంబ సభ్యులతో కలసి సమ్మక్క దర్శనం కోసం వెళ్లారు. ఆయన ఫ్యామిలీని క్యూలో పంపించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న ఎస్పీ గౌస్ ఆలం దీనిపై మండిపడ్డారు. డ్యూటీ వదిలేసి ఫ్యామిలీని .. లోపలికి పంపుతావా అంటూ ఎస్సైపై చేయిచేసుకున్నారు.
అతని కుటుంబ సభ్యులు ఎంతగా బతిమాలుతున్న ఎస్పీ అస్సలు పట్టించుకోలేదు. ఎస్పీ తనకు అధికారం ఉందని, తన భర్త ఎస్సైను నేలమీద కూర్చొబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్పీ కాళ్లు పట్టుకుని వేడుకున్న వదల్లేదని రవికుమార్ భార్య మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర దుమారంగా మారింది.
మేడారం జాతరలో రచ్చ. డ్యూటీలో ఉన్న ఎస్సైని చెంపమీద కొట్టిన ఎస్పీ. అసలేం జరిగిందంటే.?
Categories: