బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని చందనగా గుర్తించారు. ఆమె భర్త రమణ సినీ నిర్మాత బండ్ల గణేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
చందన, రమణలకు 2022 మే 26న పెళ్లి జరిగింది. వారి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చందన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య
Categories: