తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు హామీల అమలుకు ప్రజాపాలన పేరుతో అభయహస్తం అప్లీకేషన్స్ తీసుకుంది.
ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు అభయహస్తం హామీలకు అప్లై చేసుకున్న వారికి అలర్ట్ జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు లబ్ధిదారులకు ఫోన్ చేసి మీకు రేషన్ కార్డు, ఇల్లు, మంజూరు అయ్యాయి. మీ ఫోన్ నెంబర్ కు మేము ఓటీపీ పంపించాము మాకు ఆ ఓటీపీ చెప్పండి అంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. ఇలాంటి కాల్స్ పై ప్రజలు, లబ్దిదారులు అలర్ట్ గా ఉండాలని ఎవరు ఎవరికి ఓటీపీ చెప్పకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎవరైనా ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. కాగా 2023 డిసెంబర్ 28 నుంచి మొత్తం 8 పనిదినాల్లో అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో ఈ అప్లికేషన్లను స్వీకరించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా.1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి.
అభయహస్తం అప్లై చేసుకున్న వారికి బిగ్ అలర్ట్
Categories: