మీరు హ్యాంగోవర్ తోబాధపడుతున్నారా. తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి.

Categories:


పార్టీలో ఎంత తాగుతున్నామో తెలియకుండా తాగేసిన వాళ్లలో చాలా మంది ఉదయం లేవగానే హ్యాంగోవర్ తో బాధపడుతూ ఉంటారు. హ్యాంగోవర్ లక్షణాలు కొన్ని గంటల నుండి ఒక రోజు దాకా కూడా ఉండవచ్చు.

తలనొప్పీ, ఏకాగ్రత తగ్గడం, నోరు పొడిబారడం, కళ్ళు తిరగడం, అలసట, జీర్ణకోశ ఇబ్బందులు, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవటం, చెమటలు పట్టడం, వికారం, ఆందోళన, కంగారు వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

హ్యాంగోవర్ తో బాధపడేవారు కొన్ని టిప్స్ ని ఫాలో అయితే చాలు రిలీఫ్ కావొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కలగాలంటే ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం వంటి సిట్రస్ పానీయాలు తాగాలి. ఇది కడుపులో తిరగడం వంటి సమస్యలను దూరం చేస్తాయి. అలాగే పుదీనా తినడం, ఉదయాన్నే పుదీనా టీ తాగడం వలన కడుపుబ్బరం తగ్గుతుంది. అల్లం టీని కానీ, అల్లం ముక్కలను నీటిలో మరిగించి ఆ నీళ్లను కానీ తాగితే కడుపు నొప్పి తగ్గడమే కాకుండా. వికారం కూడా తగ్గుతుంది. బాడీలో డీ హైడ్రేషన్ పోవాలన్నా, తలనొప్పి తగ్గాలన్నా ఉదయాన్నే నీరు లేదా కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ఫాస్ట్గా గ్రీన్ సలాడ్స్, పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే రిలీఫ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *