జగన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 29 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్మ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శ్రీనివాసరావు ఓ న్యూస్ ఛానల్ లైవ్ లో మాట్లాడుతూ సమాజానికి తన సినిమాలతో కంటకంగా మారిన డైరెక్టర్ ఆర్జీవీ తల నరికి వస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో వర్మ.. పోలీసులు, కేసు అంటూ తిరుగుతున్నాడు. ఈ విషయం పై ఆర్జీవీ నేరుగా నేడు ఏపీ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావు పై డిజిపికి ఆయన ఫిర్యాదుచేశాడు.
తాజాగా ఈ విషయంపై జనసేన నేత నాగబాబు స్పందించాడు. ఆర్జీవీ కంప్లైంటుపై నాగబాబు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ పెట్టాడు. ఆర్జీవీని కమెడియనుతో పోలుస్తూ వెటకారంగా మాట్లాడాడు. తల నరకితే కోటి రూపాయలు ఇస్తాననడం తప్పంటూనే ఆర్జీవీపై సెటైర్లు వేశాడు. “”RGV గారి పై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను.RGV గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో.ఆ మాటకొస్తే ఇండియా లో ఏ పనికిమాలిన ఎధవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా.. మీరేం వర్రీ అవకండి కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి నాగబాబు పోస్ట్ కు వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
నాగబాబు: ఇండియాలో ఏ పనికి మాలిన వెధవ ఆర్జీవీకి హాని తలపెట్టడు.
Categories: