కాంగ్రెస్ గ్యారెంటీల హామీలు అమలుకు ఈ కార్డు కీలకం. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.

Categories:

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే రెండు గ్యారెంటీల అమలు ఫైలుపై సంతకాలు చేశారు. ఇందులో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేసుకునే పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు రేవంత్. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేయాలనుకున్న హామీలపై అధికారులకు దిశానిర్థేశం చేశారు. ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆరు గ్యారెంటీలు లబ్ధిదారునికి వర్తించాలంటే రాష్ట్రప్రభుత్వం తెల్ల రేషన్ కార్డును తంబ్ రూల్‎గా చేయనుంది. అంటే తెల్లరేషన్ కార్డును ప్రధాన అర్హతగా నిర్ణయించనుందన మాట. దీనికి సంబంధించిన విధివిధానాలు రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. డిశంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ప్రజాపాలన సభలను నిర్వహించనున్నారు అధికారులు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.గ్రామసభలకు వచ్చే వారి నుంచి చిత్తశుద్ధితో దరఖాస్తులు తీసుకుంటామని. వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశించారని పేర్కొన్నారు. గ్రామ సభల నిర్వహణకు కావాల్సిన నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి వారి పరిస్థితులు చూసి వారు ఏఏ పథకాలకు అర్హులు అనే విషయాలను రికార్డులో నమోదు చేసుకోనున్నారు. ఒక వేళ తెల్ల రేషన్ కార్డు లేకపోతే. ఆరు గ్యారెంటీలు పొందేందుకు అనర్హునిగా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *