మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే.
మనోజ్‌ని పెళ్లి చేసుకునే టైమ్‌కే మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి రాబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా మనోజ్ బయటపెట్టాడు. తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు. తన మామ-అత్తమ్మలు భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నట్లు ఎక్స్‌లో మనోజ్ పేర్కొన్నాడు.