మా బిడ్డను పెళ్లి చేసుకుంటానంటే రాహుల్‌ను ఇంటికి రమ్మన్నా.కానీ? రతిక తల్లిదండ్రులు

Categories:

హౌజ్‌లో ఉన్నప్పుడు ఈ బ్యూటీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అదే.సింగర్‌ రాహుల్‌ సిప్లీగంజ్‌తో ప్రేమాయణం. ఎప్పుడైతే హౌజ్‌లో తన మాజీ ప్రియుడి గురించి కామెంట్స్‌ చేసిందో వెంటనే రాహుల్‌- రతికల ప్రైవేట్ ఫొటోలు ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వీటిని కావాలని షేర్‌ చేశారంటూ సింగర్‌ రాహుల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రతిక సోదరి కూడా ఈ విషయంపై స్పందించింది. రాహులే తన అక్క ప్రైవేట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ చేశాడని ఆరోపించింది. తాజాగా రాహుల్‌- రతికల ప్రేమ వ్యవహారంపై రతిక తల్లిదండ్రులు రాములు, అనిత స్పందించారు. ఒక యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన వీరు తమ బిడ్డ టాప్‌ 5లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మా బిడ్డ ఎంతో కష్టపడి పైకొచ్చింది. మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుంది. పటాస్ షో చేస్తున్నప్పడే దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల ఫోన్ చేసి తాము తీయబోయే ‘ఈ జన్మ నీకే’ లో రెండో హీరోయిన్ గా నటించమని రతికను అడిగారు. ఇందుకు మేము కూడా ఒప్పుకున్నాం. అయితే ఆ విడుదల కాలేదు. ఇదే సమయంలో యూట్యూబ్‌ కోసం రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి నా బిడ్డ కొన్ని పాటలు పాడింది. ఆ టైమ్‌లో వారిద్దరి గురించి చాలామంది తప్పుగా మాట్లాడుతుంటే బాధగా అనిపించింది. రాహుల్‌ నా రెండో కూతురు పెళ్లికి కూడా వచ్చాడు. రతికను పెళ్లి చేసుకుంటానంటే మాట్లాడాలని ఇంటికి కూడా పిలిచాను. అయితే ఆ తర్వాత అతను మళ్లీ టచ్‌లో లేకుండా పోయాడు’ అని చెప్పుకొచ్చారు రతిక తల్లిదండ్రులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *