దీనికి కూడా హోస్ట్‌గా నాగార్జునే వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు హోస్ట్ మారే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు తాజాగా వదిలిన ప్రోమోలో తేలిపోయింది. దీంతో నెట్టింట వచ్చిన రూమర్స్‌కి చెక్ పడింది.
కానీ. జనాల్లో మాత్రం కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. అసలు సీజన్-6లో అన్ని విమర్శలు వచ్చినప్పటికీ మళ్లీ ఈ సీజన్లో కూడా నాగార్జుననే తీసుకోవడం ఏంటని నెటిజన్లో ప్రశ్నలు మొదలయ్యాయి. దీని వెనుక ఓ పెద్ద కారణం ఉందట. నాగార్జున కాకుంటే నెక్స్ట్ బెస్ట్ ఎవరంటే ఎన్టీఆర్, రానా లేదా బాలకృష్ణ అని అనుకున్నారు. వాళ్లకు ఇన్ట్రెస్ట్ లేకనో, డేట్స్ కుదరకనో అది కూడా జరగలేదు. ఇక నానికి అనుభవం ఉంది కానీ ఆసక్తి లేనట్లు టాక్. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి యాటిట్యూడ్ ఉన్నోళ్లు సెట్ అవుతారు అనుకుంటే. వాళ్లు చేయడానికి ముందుకు రానట్లుగా వినికిడి. ఇక ఇన్ని సమస్యల మధ్య ఫైనల్‌గా నాగార్జున మీద వ్యతిరేకతఉన్నప్పటికీ మరో మార్గం లేకనే మళ్ళీ ఆయన్ని తెచ్చారని వినికిడి. ఇక బిగ్‌బాస్ సీజన్-7 ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది
హోస్ట్‌గా నాగార్జున.. ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ మళ్లీ ఆయన్నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?
Categories: