బుల్లితెర నటి మహాలక్ష్మి- ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్‌ల వివాహం గతేడాది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనికా కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మహాలక్ష్మి చూడడానికి స్లిమ్‌గా, అందంగా ఉంటుంది. మరోవైపు ఆమె భర్త రవీందర్ మాత్రం భారీకాయంతో కనిపిస్తుంటారు. అలాంటిది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా ఇద్దరికీ ఇది రెండో వివాహం. దీంతో పెళ్లి కాగానే ఈ జంటపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్స్ వచ్చాయి. డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందంటూ మహాలక్ష్మిపై నెటిజన్లు విమర్శల వర్షం గుప్పించారు. ఇక రవీందర్‌ను కూడా బాడీ షేమింగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదీ జంట. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహాలక్ష్మి అప్పుడప్పుడూ భర్తతో కలిసున్న రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసేది. తద్వారా ట్రోలర్ల నోరు మూయించేది. అయితే మహాలక్ష్మి- రవీందర్ విడిపోతున్నారంటూ ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలోనూ ఎలాంటి ఫొటోలు షేర్ చేసుకోలేదీ జంట. దీంతో విడాకుల నిజమేనని భావించారు చాలామంది. అయితే అలాంటిదేమీ లేదని ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చింది మహాలక్ష్మి. తాజాగా తాజాగా భర్తతో కలిసి దిగిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆమె ఓ రొమాంటిక్ పోస్ట్ పెట్టింది
‘నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఏదయినా చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది. నా మనసు నిండా నువ్వే అమ్ము, ఐ లవ్యూ’
అని తన భర్తపై ప్రేమను ఒలకబోసింది బుల్లితెర నటి. ఈ పోస్టుకు రవీందర్ కూడా లవ్యూ అంటూ రొమాంటిక్ రిప్లై ఇచ్చాడు. తద్వారా తమ వైవాహిక బంధంపై వస్తోన్నరూమర్లకు చెక్ పెట్టేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.