మృగశిర కార్తె నడుస్తోంది.ఈ కార్తెలో చేపలు తినాలని పెద్దలు చెప్తుంటారు. దీంతో మృగశిర కార్తె వస్తే చేపల రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక అవే చేపలు రోడ్డుపై ఫ్రీగా దొరికితే..
ఇంకేం జనం ఎగబడిపోతుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ అలాంటి ఘటనే జరిగింది.ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తాపడింది. చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో చేపల కోసం జనం ఎగబడ్డారు. అందిన కాడికి కవర్లలో తీసుకెళ్లిపోయారు. మరికొంతమంది కూడా వీటిని తీసుకెళ్లడానికి రోడ్డుపైకి చేరుకున్నారు.