ఎన్టీఆర్ గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షోలో పార్టిస్‌పేట్ చేసిన వ్యక్తికి గుర్రం జాషువ రాసిన పద్యానికి సంబంధించి ఓ ప్రశ్న ఎదురవుతుంది. కానీ ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోతాడు. అయితే.ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎన్టీఆర్‌కు కూడా తెలియకపోవడం విశేషం. అప్పుడు ఆడియెన్స్‌లో ఉన్న 8వ తరగతి చదువుతున్న ఓ పాప ఆ క్వశ్చన్‌కు ఆన్సర్ గుర్రం జాషువా అని చెబుతుంది. దీంతో షాక్ అయిన తారక్. ఆ ప్రశ్నకు నీకు ఆన్సర్ ముందే తెలుసా.? అసలు ఎలా తెలుసు? అంటూ ప్రశ్నిస్తాడు.
ఆ పాప మాట్లాడుతూ.’మాకు 8వ తరగతిలో గుర్రం జాషువా లెసన్స్ ఉంటాయి. మాకు స్టేట్ సెలబస్ ఉంటుంది. అందులో శతక సుధ అని పోయెమ్స్ ఉంటాయి. తెలుగు టీచర్స్ బాగా ఎక్స్‌ప్లెన్ చేస్తారు’ అని చెప్పుకొస్తుంది. దీంతో ఎన్టీఆర్ ‘మనకు సిగ్గుండాలి.ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఎందుకు’ అనుకుంటా తలదించుకుని నవ్వుతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మరోసారి వైరల్‌గా మారింది.