Maruti suzuki 800 car

| | 0 Comments| 5:17 pm
Categories:

దేశీయ మార్కెట్‌లో కార్ల తయారీ, సేల్స్‌లో మారుతి సుజుకి ముందువరుసలో ఉంటుంది. అందులో ఆల్టో కె 10 అంటే వాహన ప్రియులకు మహా ఇష్టం. ఎందుకంటే తక్కువ ధర కలిగి.. అధిక మైలీజీని అందుస్తుంది కాబట్టి. ఇక ఈ కారు ధర విషయానికొస్తే.. రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 24.39 నుంచి 24.90 కిమీ మైలేజీని ఇస్తుంది. అయితే సిఎన్‌జి మోడల్ కిలోకి 33.40 నుంచి 33.85 కిమీ మైలేజీని ఇస్తుంది.

ఆల్టో ఒక చిన్న కుటుంబానికి ఉత్తమమైన కారుగా చెప్పుకోవచ్చు. ఇందులో 4 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లతో అందుబాటులో ఉంది.డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి ఫీచర్లు అందించబడ్డాయి. ఈ కారును మీ కుటుంబ సభ్యుల కోసం తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *