మెగాఫోన్ పట్టనున్నమరో జబర్దస్త్ నటుడు.. దర్శకుడిగా ఆటో రాంప్రసాద్! హీరో ఎవరంటే?

| | 0 Comments| 10:48 am
Categories:

టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో కారణంగానే ఎంతో మంది తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోలు, నటులుగా, డైరెక్టర్లుగా, సపోర్టింగ్ యాక్టర్లుగా, టెక్నీషియన్లుగా.

ఇలా పలు విభాగాల్లో జబర్దస్త్ కమెడియన్లు సత్తా చాటుతున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఏకంగా హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక బలగం తో వేణు యెల్దండి క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. త్వరలోనే ధన రాజ్ రామం రాఘవం తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. వీరితో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేశ్, రాకెట్ రాఘవ.. ఇలా చాలామంది సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నారు. అయితే వేణు, ధనరాజ్ తరహాలోనే మరో జబర్దస్త్ కమెడియన్ మెగా ఫోన్ పట్టనున్నాడు. తన దైన ఆటో పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఆటో రామ్ ప్రసాద్ త్వరలోనే డైరెక్టర్ గా మారనున్నారని తెలుస్తోంది.

సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాం ప్రసాద్.. ఈ ముగ్గురూ కలిసి జబర్దస్త్ వేదికపై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేవలం ఆన్ స్రీన్‌లోనే కాదు రియల్ లైఫ్ లోనూ వీరు ముగ్గురు మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తోన్న సుధీర్, గెటప్ శీనులను హీరోలుగా పెట్టి ఓ తీయనున్నాడట ఆటో రాం ప్రసాద్. ఓ మంచి కామెడీ ఎంటర్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే తమ ను అధికారికంగా పట్టాలెక్కిస్తానని ఆటో రాం ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా గెటప్ శీను హీరోగా నటించిన రాజూ యాదవ్ రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. చిరంజీవి కూడా ప్రమోషన్ చేయడం గెటప్ శీను పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *