ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బిఐ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది.
అయితే ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఇదే సమయంలో ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారు కూడా ఒకే మొబైల్ నెంబర్ ను అన్నిచోట్ల నమోదు చేస్తున్నారు. అయితే ఇకపై అలా కుదరదని ఆర్బిఐ స్పష్టం చేస్తుంది.అయితే మీరు కొత్తగా బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు కచ్చితంగా KYC ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆర్.బి.ఐ కేవైసీ యొక్క ప్రమాణాలు నియమాలను కూడా మార్చడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండి ఒకే నెంబర్ కు లింక్ చేసిన ఖాతాదారులకు కేవైసీచేయించుకోమని అప్డేట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలు కలిగి ఉన్నట్లయితే మరో మొబైల్ నెంబర్ ను కేవైసీ ఫారమ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతా తెరవాలి అంటే కచ్చితంగా కేవైసీ అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు అతను ఇచ్చిన సమాచారం సరైనదే అని తెలుసుకోవడానికి కేవైసీ తప్పనిసరిగా చేపించాలి. అందుకే కొత్తగా ఖాతాలను తీసుకునేవారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని బ్యాంకులు వినియోగదారులకు తెలియజేస్తున్నాయి.
RBI : ఒకే ఫోన్ నెంబర్ తో రెండు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారికి హెచ్చరిక.!
Categories: