జయవాడలో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ మరణం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రికిత (19) అనే యువతి చనిపోయింది.
కాలులో అమర్చిన రాడ్ తొలగించుకునేందుకు రికిత ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజుల క్రితమే శస్త్రచికిత్స పూర్తికాగా.. రిషిత చనిపోయినట్లు శుక్రవారం ఉదయం ఆస్పత్రి వైద్యులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వలనే రిషిత చనిపోయిందంటూ కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.