నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్ల విధానంలో కొన్ని మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఒక వాహనంపై ఒక ఫాస్టాగ్ విధానం మాత్రమే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చిందని తెలియచేసింది. ఒక వాహనంపై ఒక ఫాస్టాగ్ కంటే ఎక్కువ సంఖ్యలో ఉండటానికి వీల్లేదని తెలిపింది.
సత్వరం టోల్ గేట్ దాటేందుకు.ఇప్పటికే పేటీఎంను ఫాస్టాగ్ వినియోగదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పేటీఎం బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ సేవలు చెల్లవని పేర్కొంది. మార్చి చివర వరకూ గడువు ఇచ్చి తర్వాత దీనిని తొలగిస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలని పేర్కొంది. ఒకటి కన్నా ఎక్కువ ఉన్న ఫాస్టాగ్ వాహానాలకు టోల్ గేట్ నుంచి ఇక అనుమతించోరని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్ విధానం అమలవుతుందని తెలిపింది. దీనివల్ల సత్వరమే టోల్ ప్లాజాను దాటే అవకాశముందని పేర్కొంది. ఎలక్ట్రానిక్ లోట్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుందని ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు తెలిపింది.