హీరో శివాజీతో బోల్డ్ సీన్స్. నటి అర్చన సంచలన కామెంట్స్!

Categories:

Talugu Film ఇండస్ట్రీలో అందం అభినయం ఉన్న కొంతమందికి టైమ్ కలిసి రాదు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు వేద అలియాస్ అర్చన. నటిగా పలు చిత్రాల్లో నటించిన దక్కని ఇమేజ్ ఈ అమ్మడికి బిగ్ బాస్ తో దక్కింది.

బిగ్ బాస్ సీజన్ 1 అర్చన కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారం నుంచి తనదైన గేమ్స్, టాస్కులు, పర్ఫామెన్స్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. తర్వాత వెండితెరపై మంచి ఛాన్సులు వచ్చాయి. పెళ్లైన తర్వాత అర్చన ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు శివాజీతో బోల్డ్ సీన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ అర్చన తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జరిగిన అనుభవాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేసే సమయంలో మీరు నటనగానే భావిస్తారా లేక ఫీలో తో చేస్తారా? అని యాంకర్ ప్రశ్నకు అర్చన అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఫీల్ అవగానికి అంత సినిమా ఉండదు.. ఎందుకంటే సెట్స్ లో మన పక్కన ఎంతోమంది ఉంటారు. అప్పుడు మూడ్ తెచ్చుకొని ఫీల్ అవుతూ చేయాల్సి పని ఉండదు. కాకపోతే ఆ సీన్ కి తగ్గట్టుగా పర్ఫామెన్స్ ఇస్తాం అంతే. రొమాంటిక్ సీన్లు అలాంటి ఫీల్ తో రాకుంటే జనాలు నవ్వుకుంటారు. నేను ఏ హీరోతో రొమాంటిక్ సీన్లు చేసినా ఆయన ఒక వస్తువు.. నేను ఒక వస్తువుగా భావిస్తాను. ఎమోషన్ గా ఫీల్ అవుతూ చేయను.
హీరో శివాజీతో ‘కమలతో నా ప్రయాణం’ మూవీలో నటించినపుడు కొన్ని బోల్డ్ సీన్లలో నటించాను. ఒక్కసారి కూడా రొమాంటిక్ గా ఫీల్ కాలేదు.. అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి. సినిమాలో సీన్లు బాగా పండాలన్న ఉద్దేశంతో నేను శివాజీతో ముందుగానే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకంటే రొమాంటిక్ సీన్లు పదే పదే చేస్తే బాగుండదు. ఇద్దరం మాట్లాడుకొని ఇలా చేద్దాం అని సీన్లు కంపోజ్ చేసుకునేవాళ్లం. ‘కమలతో నా ప్రయాణం’ మూవీలో బోల్డ్ సీన్లు మొత్తం సింగిల్ టేక్ లో పూర్తయ్యాయి. ఇతర నటీనటులు రొమాంటిక్ సీన్లలో నటించేటపుడు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. నా వరకు అది ఒక సీన్ గానే తీసుకుంటా. శివాజీ అప్పటికే పెళ్లైన వ్యక్తి.. నా కోస్టార్. కాబట్టి నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అంటూ సంచలన కామెంట్స్ చేసింది అర్చన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *