జైలు నుంచే 4 పేజీల లేఖ విడుదల చేశారు కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ.

| | 0 Comments| 7:34 pm
Categories:

జైలు నుంచే 4 పేజీల లేఖ విడుదల చేశారు కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ కవిత రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది కోర్టు.

అయితే.. ఈ తరుణంలోనే. నాలుగు పేజీలతో మీడియాకు లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
వారు ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని.లిక్కర్ కేసులో నేను బాధితురాలని అంటూ చెప్పుకొచ్చారు. రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదని… మీడియా ట్రయిల్ ఎక్కువ జరుగుతుందని వివరించారు. సిబిఐ ఈడి ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందని. నా రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని తెలిపారు. నా మొబైల్ నెంబర్ ను అన్ని ఛానల్ వేసి నా ప్రైవసీ భంగం కలిగించారని ఫైర్‌ అయ్యారు కవిత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *