ఇటీవల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సేకరించి వాటికి నెంబరింగ్ ఇస్తారు. ఆ వివరాలు సంబంధిత ఎమ్మార్వో లేదా అసిస్టెంట్ సివిల్ సప్లయ్ ఆఫీసర్ కు అందజేస్తారు. మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. దరఖాస్తుదారుడు తెలంగాణకు చెందిన వాడై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అనర్హులు. సొంత కారు, బంగ్లా లాంటివి ఉండకూడదు, ఇన్‌కం ట్యాక్స్ చెల్లించేవారు అనర్హులు దారిద్యరేఖ దిగువన ఉన్నవారే అర్హులు. రేషన్ కార్డుల మంజూరు లో ఎక్కడ తేడా వచ్చినా వెరిఫికేషన్ అధికారిదే పూర్తి బాద్యత. వారే జవాబుదారి కనుక అన్ని సరైన ఆధారాలు, వివరాలు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు దారుడి ఇంటిని విజిట్ చేసినట్లుగా సర్టిఫికెట్ లో తేది, సమయంతో పాటు సేకరించిన వివరాలు పొందుపరుస్తారు. దరఖాస్తుదారుడి ఆర్తిక స్థితిగతులు, జీవన విధానాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత.. అతడు/ఆమె రేషన్ కార్డుకు అర్హులా కాదా? అని నిర్ణయిస్తారు. దరఖాస్తుదారుడు అందించిన సమాచాంలో ఏదైనా బోగస్ అని తేలితే రేషన్ కార్డు మంజూరు ఆగిపోతుంది. అర్హులైన వారు ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.. లేదా సంబంధిత అధికారులకు తమ వివరాలు అందించి సమాచారం తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో రేషన్ కార్డులకు అప్లై చేసుకోని వారు మరోసారి ప్రజా పాలన కార్యక్రమంలో అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ త్వరలో మొదలు కాబతున్నట్లు తెలుస్తుంది. అర్హులైన వారిక పేర్లను ఆన్ లైన్ లో ఉంచుతారని వార్తలు వస్తున్నాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కీలకమైన డాక్యుమెంట్ అనే చెప్పాలి. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాల ప్రయోజనం పొందాలంటే రేషన్ కార్డు తప్పని సరి. ఒకవేళ రేషన్ కార్డు మంజురైతే అందులో వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తప్పులుంటే సంధింత కార్యాలయానికి వెళ్లి సరి చేసుకోవొచ్చని అంటున్నారు అధికారులు.