ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ముగిసిన 12 రోజుల తర్వాత హుండీల లెక్కింపు పూర్తయింది.
జాతర ముగిసిన ఐదు రోజుల తర్వాత లెక్కింపు ప్రారంభించారు. దాదాపు వారం రోజులు లెక్కంపు సాగింది. మొత్తం 540 హుండీలను లెక్కించారు. గత ఆదాయ రికార్డులు ఈసారి బద్ధలయ్యాయి.
రూ.13.25 కోట్లు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగింది. ఈసారి హుండీల ద్వారా అమ్మవార్లకు రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఏడురోజులపాటు హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కించారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు సాగింది. 540 హుండీల ద్వారా రూ.13,25,22,511 ఆదాయం వచ్చింది.
779 గ్రాముల బంగారం
ఇక అమ్మవార్లకు హుండీల్లో నోట్లు, చిల్లర నాణేలతోఓపాటు భక్తులు బంగారం, వెండి వస్తువులను కూడా కానుకలుగా సమర్పించారు. ఇలా ముండీల్లో 779.800 గ్రాముల బంగారు ఆభరణాలు, 55 కిలోల 150 గ్రాముల వెండి వస్తువులు కానుకలుగా వచ్చాయి.
బ్యాంకుల్లో డిపాజిట్.
హుండీల లెక్కింపు పూర్తి కావడంతో నాణేలను అధికరులు సంచుల్లో మూటకట్టి బ్యాంకులకు తరలించారు. హుండీల ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు హెచ్‌డీఎఫ్‌సీ, యూనియన్, కెనరా బ్యాంకుల్లో జమ చేశారు. వారం రోజులు సాగిన హుండీల లెక్కింపులో 350 మంది పాల్గొన్నారు. ఈ ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, మేడారం జాతర ఈవో రాజేంద్రం పర్యవేక్షించారు.
ముగిసిన మేడారం హుండీల లెక్కింపు. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?
Categories: