ఒక్క రెడ్ యాపిల్ సాంగ్ కారణంగా కోట్లు సంపాదించిన స్కూల్ టీచర్.!

| | 0 Comments| 11:50 am
Categories:

ఆరేళ్ల క్రితం ఓ ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ‘యాపిల్ యాపిల్’ అనే సాంగ్ ఇప్పడు ట్రెండింగ్ గా మారింది. వివరాల్లోకెళ్తే.ఆంధ్రప్రదేశ్ కు చెందిన బిక్కి శ్రీనివాసులు అనంతపురంలోని కళ్యాణదుర్గ మండలం ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేస్తున్నాడు. ఈయన తన స్టూడెంట్స్ కు పాటలు, నటన ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేశాడు. పాటల ద్వారా నేర్పించడం వల్ల పిల్లలు త్వరగా నేర్చుకోగలరని. అలాగే వినోదం కూడా లభిస్తుందని బిక్కి శ్రీనివాసులు ఆలోచించి. ఆరేళ్ల క్రితం ‘యాపిల్ యాపిల్ రెడ్ రెడ్ యాపిల్’ అనే పాటను రూపొందించారు.

ఈ పాట యాపిల్, అరటిపండు, వాటి రంగు, రుచిని వివరిస్తూ రూపొందించబడింది. దాన్ని చిన్నారులకు పాడి వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్ చేశాడు. ఈ సాంగ్ కాస్త వైరల్‌ కావడంతో ఏకంగా189 కోట్ల మంది వీక్షించారు. దీంతో ఈ ఉపాధ్యాయుడు కోట్లు రాబట్టినట్లు సమాచారం. అలాగే ‘బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై’ సాంగ్ రూపొందించి.. నెట్టింట పంచుకోగా. 1.1 కోట్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా బిక్కి శ్రీనివాసులుకు యూట్యూబ్‌లో అతనికి 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త విన్న జనాలు పిల్లలకు చదువు చెప్పే విధానాన్ని చూసి బిక్కి శ్రీనివాసులును ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *