హైదరాబాద్ నిజాంపేట బాచుపల్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లి ఓ మూలన కూర్చున్నాడు.
ఇంతలో ఇంట్లో ఉన్న మహిళ అపరిచిత వ్యక్తిని చూసి షాక్ కి గురైంది. బాగా భయపడిపోయింది. వెంటనే తన ఫోన్ తీసుకుని వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. ఎవరు నువ్వు, ఎందుకు ఇంట్లోకి వచ్చావు? అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ప్రశ్నించింది. దీంతో ఆ వ్యక్తి కొంత కంగారుపడ్డాడు. దయచేసి అరవొద్దు మేడమ్ అని వేడుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.
వచ్చిన వాడు.చూస్తుండగానే. 2వ అంతస్తు నుంచి కిందకు దూకి పారిపోయాడు. ఆ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఓ మూలన కూర్చోవడం ఆ తర్వాత రెండో అంతస్తు నుంచి దూకి పారిపోవడం ఇవన్నీ ఫోన్ లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడటం తీవ్ర భయాందోళనకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నువ్వు ఎవరు అని ఆ మహిళ అతడిపై కేకలు వేయడం, అరవొద్దు మేడమ్ మీ కాళ్లు మొక్కుతా అని ఆ వ్యక్తి వేడుకోవడం, ఆ తర్వాత 2వ అంతస్తు నుంచి దూకి పారిపోవడం. ఇవన్నీ వీడియోలో ఉన్నాయి. ఎవరు నువ్వు? నీ పేరు ఏంటి? ఎందుకు ఇంట్లోకి చొరబడ్డావు? అని ఆ మహిళ అడుగుతుండగా.. ఆ అనుమానాస్పద
వ్యక్తి రెండో అంతస్తు నుంచి దూకి పారిపోయాడు. నన్ను ఎవరో పాయిజన్ చేశారు, నన్ను చంపడానికి చూస్తున్నాడు అని ఆ వ్యక్తి అనడం వీడియోలో రికార్డ్ అయ్యింది. కాగా.ఆ వ్యక్తి ఎవరు? ఆ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడు? ఆ తర్వాత 2వ అంతస్తు నుంచి దూకి ఎందుకు పారిపోయాడు? ఇప్పుడీ ప్రశ్నలకు పోలీసులే సమాధానాలు చెప్పాల్సి ఉంది
ఒంటరి మహిళలు, వృద్ధులు జాగ్రత్త..! హైదరాబాద్లో షాకింగ్ ఘటన, ఇంట్లోకి దూరిన అపరిచితుడు
Categories: