ఇప్పటి వరకు టాలీవుడ్ లో మూడు జంటలు ఇలాంటివి ఉన్నాయి.మొదటగా వాణిశ్రీ, కృష్ణ గురించి మాట్లాడుకోవాలి. ఈ జంట గురించి గతంలో కూడా తెలుసుకున్నాము. విషయం ఏమిటి అంటే వీరిద్దరూ దాదాపు 13 సినిమాల్లో నటించినా కూడా ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకోలేదట. అలా అని వీరిద్దరూ గొడవపడి మాట్లాడుకోలేదు అంటే పొరపాటే. కేవలం మాట్లాడుకోలేదు అంతే. ఒకరి విషయాల్లో ఒకరు వేలు పెట్టుకోలేదు. గొడవ లేదు స్నేహం లేదు. అలా ముభావంగా ఎవరికి నచ్చినట్టు వారు నటించేసి వెళ్లిపోయేవారు. సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా బయటకు వచ్చాక ఒకసారి మాట్లాడుకున్నారట ఈ జంట.
ఇదే తరహాలో రాధిక, చిరంజీవి కూడా చాలా సినిమాల్లో నటించారు కానీ మాట్లాడుకోలేదు. నిజానికి వీరిద్దరూ మంచి స్నేహితులు కానీ అలిగితే కొన్నేళ్లు మాట్లాడుకోకుండా ఉండేవారట. అలా అయిదారేళ్ల పాటు వీరిద్దరు మాట్లాడుకోకుండా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు మళ్ళీ గొడవపడతారు. ఇది వీరికి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. ఇప్పుడు పర్వాలేదు కానీ గతంలో ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు.
ఇలాగే మరొక జంట కూడా పదేళ్ల పాటు మాట్లాడుకోలేదు వారే సురేష్ మరియు విజయశాంతి వీరు కెరియర్ మొదట్లో కలిసి నటించారు ఆ తర్వాత విజయశాంతి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ అయిపోయింది.
సురేష్ మీడియం రేంజ్ హీరో గానే ఉండిపోయాడు. ఈగో క్లాష్ వల్ల మాట్లాడుకోలేదని అందరు అనుకుంటారు కానీ కేవలం వారి మధ్య ప్రొఫెషనల్ డిఫెరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. సురేష్ తను హీరో కాబట్టి తన సినిమాలో హీరోయిన్ ఉంటే సరిపోతుంది అనుకుంటాడు. కానీ విజయశాంతి ఆమె లీడ్ హీరో మరియు హీరోయిన్ గా ఉంటుంది. ఆమెకు హీరోతో పనిలేదు. ఆమె సినిమాలో నటించే హీరో చిన్న పాత్ర అయినా సరిపోతుంది. దానికోసం ఓసారి అడిగితే అందుకు సురేష్ ఒప్పుకోకపోవడంతో అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత పదేళ్ల పాటు మాట్లాడుకోలేదు.