కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు ప్రజల్లో పేరు ఉంది. వెండితెరపై ఎన్నో పాత్రలకు తనదైన అద్భుతమైన నటనతో ప్రాణం పోశారాయన.
విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎంతో మందిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే.ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తన పేరును కొందరు వాడుకోవడంతో సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఓ లేఖ విడుదల చేశారు.
స్వప్రయోజనాలకు నా పేరు వాడుకోవద్దు
”ఈ మధ్య కాలంలో నా పేరును రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీకి చెందిన వారైనా వారి వారి స్వప్రయోజనాల కోసం నా పేరును వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను” అని మోహన్ బాబు పేర్కొన్నారు.
మనం అనేక రకాల భావావేశాలు ఉన్న వ్యక్తుల ప్రపాప్మచంలో జీవిస్తున్నామని, ఎవరి అభిప్రాయాలు వారివి అని, అది వారి వ్యక్తిగతమని మోహన్ బాబు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ”చేతనైతే నలుగురికి సాయపడడంలో దృష్టి పెట్టాలి గానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకు రావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేస్తూ. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉండమని కోరుకుంటూ. ఉల్లఘించిన వారిపై న్యాయచర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను” అని పేర్కొన్నారు.