మేడారం జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు నిలబడి వేచి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేయడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
మరోవైపు వీఐపీలు వచ్చినప్పుడు భక్తులను ఆపివేయడంతో మరింత అసహనానికి భక్తులు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీఐపీ మార్గంలో వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావుపై కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వీఐపీ మీరు అంతా. నువ్వేమైనా వీఐపీనా. మేడారంలో ఎర్రబెల్లి పై పబ్లిక్ గుస్సా అయ్యారు.
ఎవరికి వీఐపీ మీరు అంతా. మేడారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై పబ్లిక్ గుస్సా.
Categories: