తమిళనాడు మాజీ సీఎం, సినీ నటి, పురుచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జయలలితకు సంబంధించిన బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రక్రియను ప్రారంభించింది.
అక్రమాస్తుల కేసులో 10 ఏళ్ల క్రితం జయలలితను దోషిగా తేల్చిన కోర్టు ఆమెకు భారీగా జరిమానాతోపాటు జైలు శిక్షను కూడా విధించింది. ఈ క్రమంలోనే ఆమె చనిపోవడంతో జయలలిత వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఆభరణాలతోపాటు, ఇతర ఖరీదైన వస్తువులు, స్థిర, చర ఆస్తులను వేలం వేయడం లేదా అమ్మడం ద్వారా జరిమానాను రాబట్టుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జయలలిత బంగారం తీసుకెళ్లేందుకు తమిళనాడు ప్రభుత్వం రావాలని బెంగళూరు కోర్టు తాజాగా పేర్కొంది.
జయలలిత బంగారం తిరిగి ఇచ్చేస్తాం, 6 పెద్ద ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి. ఎన్ని కిలోలు ఉన్నాయంటే
Categories: