ఒక సినిమా మిస్ చేసుకున్నందుకు మహేష్ బాబు తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది ఏ సినిమా అంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది.ఈ సినిమాని త్రివిక్రమ్ మొదట మహేష్ బాబుతో చేయాలనుకొని ఖలేజా సినిమా సమయంలోనే ఆ స్టోరీ ని మహేష్ బాబు కి చెప్పాడట. అయితే ఖలేజా సినిమా ఫ్లాప్ అవ్వడంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయాలనే ఉద్దేశ్యాన్ని అప్పుడు మహేష్ బాబు మానుకున్నాడు. ఇక దాంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బిజినెస్ మ్యాన్ అనే సినిమా చేశాడు. ఇక త్రివిక్రమ్ ని పట్టించుకోకుండా మహేష్ బాబు వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాడు.
అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది సినిమా సూపర్ సక్సెస్ అయింది. దాంతో మహేష్ బాబు ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది అని ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర ఆ విషయాన్ని చాలా సార్లు తెలియజేసినట్టుగా అప్పట్లో చాలా కథనాలు అయితే వెలువడ్డాయి.ఇక మొత్తానికైతే ఒక సూపర్ హిట్ సినిమాను వదులుకొని మళ్ళీ ఇప్పుడు గుంటూరు కారం సినిమా చేసి భారీ Hit ను మూటగట్టుకున్నాడు.
సినిమా మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ భాద పడుతున్న మహేష్ బాబు
Categories: