కర్నూలు జిల్లా ప్రాణంలో దారుణం జరిగింది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందారు. హాస్టల్ బాత్ రూంలో తీవ్ర రక్తస్రావంతో చనిపోయారు.
రాత్రి 10 గంటల సయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆమె గర్భం దాల్చి 9 నెలలు నిండిపోవటంతో బాత్ రూమ్‌లోనే ప్రసవించినట్లు తెలుస్తోంది. పండంటి పాపకు ఆమె జన్మనిచ్చినట్లు సహ విద్యార్థులు చెబుతున్నారు. చెట్ల మళ్లాపురానికి చెందిన ఉమా మాధురి పాణ్యం ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే మాధురిని మోసం చేసింది ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు మాధురి గర్భం విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో దారుణం.కాలేజీ హాస్టల్‌లో ప్రసవించి విద్యార్థి మృతి
Categories: