TDP-జనసేన పొత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేటలో టీడీపీ అధినేత చంద్రబాబునాయడు అభ్యర్థిని ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇది పొత్తు ధర్మం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. యాభై, డెబ్బయి తీసుకోవాలని కొందరు చెబుతుంటే అవి తనకు తెలియనవి కావని పవన్ అన్నారు. బలం ఇచ్చే వాళ్లం అవుతున్నాం కాని, తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ఏమీ తెలియకపోతే తాను రాజకీయాల్లోకి ఎలా వస్తానని ప్రశ్నించారు. జనంలో తిరగడని, సమస్యలు తనకు తెలియవని విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
కలపడం కష్టం.
ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టమని, విడదీయడం సులభమన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను కలిసి ఉండటానికే ఇష్టపడతానని అన్నారు. నిర్మించడమంటే ఇష్టమని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ పై కూడా మండి పడ్డారు. 22 దళిత పథకాలను తీసేసిన జగన్, అంబేద్కర్ విగ్రహం పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ జనం ముఖ్యమంత్రా? సారాయి వ్యాపారా? అని ప్రశ్నించారు. అధికారంలో వస్తామో లేదో తెలియదని, ఊరంతా శత్రువులున్న జగన్ తో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి కానీ, అధికారం వస్తుందన్న గ్యారంటీ లేదని ఆయన అన్నారు.
ఫస్ట్ టైం చంద్రబాబు ప్రకటనను తప్పుపట్టిన పవన్
Categories: