ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో ‘పుష్ప 2’ ఒకటి. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే.
ఈ సినిమాలో డైలాగులు, పాటలు, డాన్స్ అనీ కూడా అందరిని అలరించడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం సుకుమార్ మరియు అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. ఈ సినిమాకి గాను జాతీయ వద్ద ఉన్నటువంటి అవార్డు కూడా బన్నీ గెలవడం జరిగింది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో కేశవ పాత్ర చేసిన నటుడు జగదీష్ ఓ పోలీస్ కేసులో ఇరుక్కుని జైలు పాలు కావటం తెలిసిందే. గత ఏడాది ఈ సంఘటన జరగటంతో కేశవ పాత్రకి సంబంధించి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవటంతో.. “పుష్ప” సెకండ్ పార్ట్ చెప్పిన సమయానికి విడుదల అయ్యే అవకాశాలు లేనట్లు ఉన్నట్టు వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. పుష్ప రెండో భాగం ఆగస్టు 15వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే కేశవ పాత్ర చేసిన జగదీష్ అరెస్టుతో సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి పరిస్థితులలో తాజాగా సినిమా యూనిట్ స్పందించింది. “పుష్ప” రెండో భాగం చెప్పిన సమయానికి రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. “పుష్ప 2” అనుకున్న సమయానికి రిలీజ్ కాదని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప” రెండో భాగం రిలీజ్ కాబోతున్నట్లు అధికారికంగా మరోసారి ధ్రువీకరించడం జరిగింది. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ విషయంలో సినిమా యూనిట్ మరోసారి అదే తేది కన్ఫర్మ్ చేయడంతో బన్నీ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన “పుష్ప” మేకర్స్…
Categories: