ఆ విషయంలో నన్ను ఎంత టార్చర్ చేసేవాడు . నోయెల్ పై ఎస్తర్ నొరొన్హా సెన్సేషనల్ కామెంట్స్.!

Categories:

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అందుకే అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయిపోయానని ఎస్తర్ ఓపెన్ అయింది. అందుకే అంత త్వరగా విడాకులు తీసుకున్నానని ఎస్తర్ చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత నోయల్ తనపై చెడు ఇంపాక్ట్ పడేలా క్రియేట్ చేశాడని ఎస్తేర్ చెప్పింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకున్నా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నోయల్ క్రియేట్ చేసిన చెడు ప్రభావంతో తనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయని ఎస్తర్ చెప్పింది.
అంతా నాదే తప్పు అనుకోని ఒక వ్యక్తి అయితే ఏకంగా హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తామని హెచ్చరించాడని తెలిపింది. దీంతో ఈ విషయాలు జనాల్లో హాట్ ఇష్యూ అయ్యాయని అన్నారు. విడాకులు తీసుకునే సమయంలో కొందరు మేమున్నాము అని ధైర్యం ఇచ్చారని తెలిపింది. విడాకులు తీసుకుని మంచి పనే చేశానని, ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకువచ్చింది. భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయక లాంటి సినిమాల్లో ఎస్తర్ నటించింది. పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా ఎస్తర్ నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఆమెకు గుర్తింపు వచ్చింది..ఆమె తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *