నిషేధిత చైనా మాంజా నిగ్గు తేల్చేందుకు దిల్లీ వెళ్లిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. ధూల్‌పేట కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో చైనా మాంజా విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగాయి.
ఈ నేపథ్యంలో చైనా మాంజా విక్రయ దుకాణాలపై టాస్క్‌ఫోర్స్, మంగళ్‌హాట్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఏకకాలంలో 18 కేసులు నమోదు చేశారు. సంక్రాంతికి ముందు నగరంలో వరుస ప్రమాద ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు చైనా మాంజా గుట్టురట్టు చేయాలని నిర్ణయించారు. సౌత్/వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మంగళ్‌హాట్ పోలీసులు దిల్లీకి వెళ్లారు. దిల్లీ కేంద్రంగానే మాంజా నగరానికి పెద్దమొత్తంలో దిగుమతి అయినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. సూత్రధారులు, పాత్రధారుల వివరాలు బయటపడినట్లు తెలిసింది. చైనా మాంజాతో ఓ సైనికుడు మృతిచెందగా, మరెందరో గాయాలపాలైన విషయం తెలిసిందే.
చైనా మాంజా నిగ్గు తేల్చేందుకు దిల్లీకి పోలీసులు
Categories: