బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఓ వైపు తన యాంకరింగ్ అదరగొడుతూనే మరోవైపు మూవీల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా లో ‘సూపర్ సింగర్’ అనే ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజైంది. ఈ వీక్ సింగర్స్ అంతా రెట్రో నేపథ్యంలో సాంగ్స్ పాడుతున్నారు. ఈ ప్రోమోలో జడ్జ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, శ్రీముఖితో డాన్స్ చేస్తూ, సైగా చేస్తాడు.
దీంతో తను స్పందించి.ఈ తుంటరి అబ్బాయి ఇలా చేస్తాడని అప్పుడే అనుకున్నాను. కానీ నేను మీతో లవ్‌లో లేనని. రాహుల్ సిప్లీగంజ్ ప్రేమలో ఉన్నానని వెల్లడించింది.
దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక శ్రీముఖి ఎప్పటి నుంచో ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్వరలో ఈ బ్యూటీ గుడ్‌న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ హ్యాపీ కామెంట్స్ పెడుతున్నారు.
రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమలో పడిన శ్రీముఖి.స్వయంగా వెల్లడించిన యాంకర్
Categories: