నితిన్ కు షూటింగ్ లో గాయాలు. షూటింగ్ బ్రేక్.

Categories:

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.నితిన్ తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్.
దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఏపీ లోని మారేడుమిల్లి అడవులకు వెళ్లారు. అక్కడ భారీ యాక్షన్ సన్నీ వేశాలు జరుగుతున్న సమయంలో అతనికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేశారు. నితిన్ చేతికి గాయాలు అయ్యాయి. పరీక్షించిన డాక్లర్లు మూడు వారాలు పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారని సమాచారం.

నితిన్ కు గత ఏడాది చేసిన ఒక్క సినిమా కూడా సరైన హిట్ ను ఇవ్వలేక పోయాయి.ఎక్స్ ట్రా మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.ఆ సినిమా కూడా ఏమాత్రం మెప్పించలేకపోయవడంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశే ఎదురైంది. ఇప్పుడు చేస్తోన్న తమ్ముడు సినిమా పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా పై డైరెక్టర్ కూడా హిట్ కొట్టాలనే ఆలోచనతో సినిమాను షూటింగ్ చేస్తున్నారు.
ఇక శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేస్తోన్న మూవీ ఇది. నితిన్ పవర్ స్టార్ కు వీరాభిమాని. ఆయన సినిమాల్లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు ఉంటుంటాయి. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తోనే సినిమా చేస్తుండడం విశేషం. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని టాక్. అందుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *