Amarender Reddy తెలంగాణలో పెట్రోల్‌కి ఎలాంటి సమస్య లేదు

Categories:



తెలంగాణలో పెట్రోల్‌కి ఎలాంటి సమస్య లేదని తెలంగాణ స్టేట్ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ. మెటల్ వెకిల్ యాక్ట్ సవరణలో భాగంగా నిరసన తెలిపారని చెప్పారు. కానీ రేపు ఎల్లుండి పెట్రోల్ బంక్‌లు బంద్ అంటు వస్తున్న వార్తలు సరికాదన్నారు. వినియోగ దారులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అన్ని బంక్‌లో పెట్రోల్ అందుబాటులో ఉంటుదన్నారు. గాబరపడి ఎక్కువ మొత్తంలో ఎవరు పెట్రోల్ ,డీజిల్ కొనుగోలు చేయొద్దని మనవి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బంక్‌ల్లో పెట్రోల్ లోడ్ అవుతుందని అమరేందర్‌రెడ్డి చెప్పారు.

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఎందుకు పెట్టారంటే.

తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో ఎలాంటి షార్టేజ్ లేదన్నారు. నిన్న ట్యాంకర్ల డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా సమ్మె చేశారని చెప్పారు. ఈరోజు వారితో మాట్లాడి సమ్మె విరమించినట్లు తెలిపారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారని. దీంతో గందరగోళం నెలకొందన్నారు. ఈరోజు రాత్రి వరకు అన్ని బంకులకు స్టాక్ వస్తుందన్నారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ రోజురెండు డిపోల నుంచి 40 లక్షల లీటర్ల డీజిల్, పెట్రోల్ సప్లై అవుతుందని చెప్పారు. పెట్రోల్ బంకులు బంద్ అవుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని. అందువల్లే ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారని చెప్పారు. మరో మూడు గంటల్లో యథావిధిగా పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉంటుందని అమరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *