హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్‌లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
Categories: