జాగ్రత్తలు పాటించాలని, వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో ఉండాలని, తరచూ చేతులు కడుక్కోవాలని సిఫార్సు చేస్తున్నారు. కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న క్రమంలో ఆరోగ్య నిపుణులు పలు సలహాలు చేస్తున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ లక్షణాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఈ కొవిడ్ సబ్ వేరియంట్ లక్షణాలు చాలా తేలికపాటివి, మితమైనవి. ఈ వేరియంట్ బారిన పడిన వ్యక్తుల్లో ముఖ్యంగా కనిపించే లక్షణాలు..
జ్వరం
ముక్కు కారటం
గొంతు నొప్పి
తలనొప్పి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఆకలి లేకపోవడం
వికారం
విపరీతమైన అలసట
జీర్ణాశయాంతర సమస్యలు
సాధారణంగా కనిపించే ఈ లక్షణాల నుంచి కోలుకునేందుకు నాలుగు నుంచి 5రోజులు పట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా కొత్త వైరస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.
Categories: