Bigg boss 7 telugu: అమర్‌, ప్రశాంత్‌ అభిమానుల మధ్య గొడవ. ఆర్టీసీ బస్సు ధ్వంసం

Categories:



బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss 7 telugu) టైటిల్‌ను యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ (Pallavi Prashanth) గెలుచుకున్న సంగతి తెలిసిందే.

రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ (Amardeep) నిలిచాడు. ఈ సందర్భంగా ‘బిగ్‌బాస్‌’ షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున అమర్‌, ప్రశాంత్‌ అభిమానులు వచ్చారు. ప్రశాంత్‌ విజేత అని తెలియగానే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం చినికి గాలివానలా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ ఆర్టీసీ బస్సుపైనా దాడి చేసి, అద్దాన్ని పగలగొట్టారు.

మరోవైపు హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమర్‌ దీప్‌ వాహనాన్ని చుట్టుముట్టారు. ముందుకు కదలనీయకుండా దాడిచేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి, అమర్‌ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఆటను ఆటగా చూడాలని కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *