చాలా అప్పుల్లో కూరుకుపోయాం..
ప్రిన్స్ సోదరుడు మాట్లాడుతూ.’మాది ఉమ్మడి కుటుంబం. మేము నలుగురం అన్నదమ్ములం.. ఇంకా నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. లోన్లు తీసుకుని వారికి పెళ్లి చేశాం. రూ.30-35 లక్షల వరకు అప్పు ఉంది. మాకు సరైన ఇల్లు కూడా లేదు. ప్రిన్స్ బిగ్బాస్కు వెళ్లినప్పుడు. తనకు వచ్చే డబ్బుతో మంచి ఇల్లు తీసుకుందాం అన్నాడు. మరోపక్క లక్షల్లో అప్పులు.మా పరిస్థితి అంత దయనీయంగా ఉంది’ అని చెప్పాడు. ఇప్పటికే ప్రిన్స్ గ్రాండ్ ఫినాలేలో రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రిన్స్ యావర్కు మరింత డబ్బు ఆఫర్ చేసుంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పీకల్లోతు అప్పుల్లో యావర్. ప్రైజ్మనీ కూడా సరిపోదన్న ప్రిన్స్ సోదరుడు
Categories: